‘రిమూవ్ చైనా యాప్స్’ను తొలగించిన గూగుల్

న్యూఢిల్లీ: ఇండియాకు చెందిన ఓ మొబైల్ అప్లికేషన్ ను టెక్ దిగ్గజం గూగుల్ యాప్ స్టోర్ నుంచి తొలగించింది. యూజర్లను తమ ఫోన్స్ లో నుంచి చైనీస్ యాప్స్ ను తొలగించేలా చేస్తుండటంతో.. సదరు అప్లికేషన్ కంపెనీ పాలసీలను ఉల్లంఘించడంతో తీసివేత నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు. రిమూవ్ చైనా యాప్స్ పేరుతో ఉన్న సదరు అప్లికేషన్.. 5 మిలియన్ డాలర్ల డౌన్ లోడ్స్ తో మే నెలాఖరుకు ఇండియాలో టాప్ ఫ్రీ ట్రెండింగ్ యాప్స్ లో ఒకటిగా నిలిచింది.

హిమాలయన్ బార్డర్ లో చైనా, ఇండియా మధ్య వివాదం కారణంగా డ్రాగన్ కంట్రీకి చెందిన యాప్స్ ను బాయ్ కాట్ చేయాలనే నినాదాల మధ్య రిమూవ్ చైనా యాప్స్ బాగా పాపులర్ అయింది. ఈ యాప్ యూజర్ల ఫోన్స్ లో నుంచి చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ రూపొందించిన టిక్ టాక్, అలీబాబా కంపెనీ తయారు చేసిన యూసీ బ్రౌజర్ లాంటి యాప్స్ ను స్కాన్ చేసి గుర్తించేది. ఒక్కసారి యాప్స్ ను డిలీట్ చేశాక.. ‘మీరు సూపర్, చైనా యాప్స్ దొరకలేదు’ అని మెసేజ్ డిస్ ప్లే చేసేది. ఈ యాప్ ను రూపొందించిన వన్ టచ్ ల్యాబ్ సంస్థ దీనిపై స్పందించలేదు. కానీ తమ వెబ్ సైట్ లో సదరు కంపెనీ యాప్ రిమూవ్ చేశారని, సహకరించినందుకు యూజర్లకు కృతజ్ఞతలు తెలిపింది.

Latest Updates