జియోలో రూ.33 వేల 737 కోట్లు పెట్టుబ‌డులు పెట్టిన గూగుల్

రిల‌యన్స్ జియోలో 7.7శాతం వాటాని ద‌క్కించుకునేందుకు గూగుల్ అక్ష‌రాల రూ.33 వేల 737 కోట్ల ని పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు జియో ఎండీ ముఖేష్ అంబానీ ప్ర‌క‌టించారు.

రిల‌య‌న్స్ జియో 5జీ స్మార్ట్ ఫోన్ల‌ను మ‌రింత విసృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. దీన్ని అదునుగా భావించిన ఇప్ప‌టికే కార్పొరేట్ దిగ్గ‌జాలైన ఫేస్‌బుక్, క్వాల్‌కామ్, ఇంటెల్ లు జియోలో భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టాయి.

తాజాగా గుగూల్ సైతం జియోలో పెట్టుబుడులు పెట్టింది. దీంతో గుగూల్ పెట్టుబ‌డిన పెట్టిన 14వ సంస్థ‌గా జియో పేరుపొందింది. గూగుల్ పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్ ఈక్విటీ విలువ రూ .4.36 లక్షల కోట్లని రిలయన్స్ ఇండియా లిమిటెడ్ 43 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్ర‌క‌ట‌న చేసింది. దీంతో రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలు సేకరించిన పెట్టుబ‌డులు రూ .1,52,056 కోట్లకు పెర‌గ‌నున్నాయి.

కొద్దిరోజుల క్రితం ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్ ఫర్ ఇండియా ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో భార‌త్ లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సుంద‌ర్ పిచాయ్ పెట్టుబ‌డులు ప్ర‌క‌టించిన కొద్దిరోజుల‌కే గుగూల్ జియోలో పెట్టుబ‌డులు పెట్టింది.

కాగా భార‌త్ లో గూగుల్ పెట్టుబుడులు ముఖ్యంగా ప్రాంతీయ భాష‌ల అభివృద్ధి, ఉత్పత్తులు, సేవ‌లు, వ్యాపారాలు డిజిట‌లైజ్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. వీటితో పాటు సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆరోగ్యం, వ్యవసాయం మరియు విద్యారంగాల్లో స‌మూల మార్పులు చోటు చేసుకునేందుకు అవ‌కాశం ఉన్న‌ట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

Latest Updates