ఐదు హెరిటేజ్ సైట్లకు ‘గూగుల్‌ త్రీడీ’

ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని కల్చర్, ఆర్కిటెక్చర్‌‌ను చాటిచెప్పే వరల్డ్ హెరిటేజ్ సైట్‌‌లలో 5 ప్రదేశాలు కనుమరుగయ్యే దశలో ఉన్నాయట. క్లైమేట్ చేంజ్ కారణంగా ఆ కట్టడాలు నాశనమయ్యే పరిస్థితి వచ్చిందట. అందుకే.. ఆ కట్టడాలు నేలమట్టం కాకముందే వాటికి 3డీ మోడల్స్ ను తయారు చేయాలని యునెస్కో నిర్ణయించింది. ఒకవేళ ఆ కట్టడాలు కనుమరుగైపోయినా, ముందు తరాలకు వాటి రూపాలను కళ్లకు కట్టినట్టు చూపొచ్చని, వాటి గొప్పతనం వివరించొచ్చని యునెస్కో భావిస్తోంది. ఇందుకోసం ‘హెరిటేజ్ ఆన్ ఎడ్జ్’ పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. దీనిలో భాగంగా చిలీలోని ఈస్టర్ ఐల్యాండ్‌‌లో ఉన్న మొవాయీ హెడ్ కార్వింగ్స్, స్కాట్లాండ్‌‌లోని ఎడిన్ బరో కెజిల్, బంగ్లాదేశ్‌‌లోని మాస్క్‌‌ సిటీ ఆఫ్​బఘేరత్, టాంజానియాలోని గ్రేట్ మాస్క్యూ, పోర్చుగీస్ ఫోర్ట్, పెరూలోని పురాతన నగరం చన్ చన్ సిటీలకు 3డీ మోడల్స్‌‌ను ఆర్కిటెక్చర్లు తయారు చేయనున్నారు. అప్పట్లో ఉన్న రూపాలు కాకుండా, ప్రస్తుతం ఎలా ఉన్నాయో అలాగే మోడల్స్ తయారు కానున్నాయి. వీటిని ఆగ్మెంటెడ్ రియాలిటీలోనూ అందుబాటులోకి తెస్తామని యునెస్కో చెప్పింది.

Latest Updates