స్పోర్ట్స్​ లవర్స్​ కోసం గూగుల్​ కొత్త ఫీచర్

ఫేవరెట్ ​స్పోర్ట్స్ టీమ్​కు సంబంధించి మ్యాచ్​ జరుగుతున్నప్పుడు బిజీగా ఉంటే లైవ్​ చూసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు గూగుల్​ ద్వారా ఆండ్రాయిడ్​ ఫోన్లలో హోమ్​స్క్రీన్​పై స్కోర్స్​ చూసుకోవచ్చు. ఈ ఫీచర్​కు మరిన్ని హంగులద్దుతోంది గూగుల్. సెర్చ్​ బార్​లో క్లిక్​ చేసి, ఒక మ్యాచ్​ను పిన్​ చేసుకుంటే హోమ్​స్క్రీన్​పై లైవ్​ స్కోర్ ​కనిపిస్తుంది.

అయితే త్వరలో రానున్న ఫీచర్ ద్వారా ఇలా ఒక మ్యాచ్​ను పిన్​ చేశాక, ఫ్లోటింగ్​ బాక్స్​పై క్లిక్​ చేయాలి. దీనిపై ట్యాప్​ చేశాక ‘ఆటోమేటికల్లీ పిన్​ ఫ్యూచర్​ మ్యాచెస్’ ఆప్షన్​ కనిపిస్తుంది. దీన్ని క్లిక్​చేసి, కావాల్సిన మ్యాచ్​లు, నచ్చిన టీమ్​లను సెలెక్ట్​ చేసుకోవాలి. వాటికి సంబంధించిన మ్యాచ్​లు ఎప్పుడు జరిగినా వెంటనే లైవ్​స్కోర్​తో అప్ డేట్స్​ ఆటోమేటిగ్గా వస్తుంటాయి.

Latest Updates