కారు బ్యానెట్ పై పోలీస్..వేగంగా వెళ్లిన రౌడీలు

ఉత్తర్ ప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్రిమినల్స్ పోలీసుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా రౌడీలు ప్రయాణిస్తున్న కారును చెక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కారు ఆపకుండా డ్రైవింగ్ చేశారు. అయితే ఎలాగైనా నిందితుల్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో ఓ పోలీస్ కారు బ్యానెట్ ను పట్టుకున్నాడు.

అలిగ్రా జిల్లా టప్పాల్ విలేజ్ జాతీయ రహదారిపై యమునా ఎక్స్ ప్రెస్ వే మార్గంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఘటనకు ముందు నిందితుల హమీద్పూర్ క్రాసింగ్ వద్ద రెండు గంటలకు పైగా రెక్కీ నిర్వహించారు.  నిందితుల గురించి సమాచారం అందడంతో కారును ఆపేందుకు తాము ప్రయత్నించగా తప్పించుకున్నట్లు చెప్పారు. అయితే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని, కారులో ఇద్దరు పురుషులు ఒకమహిళ ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

Latest Updates