బుల్లెట్‌కు భయపడని ‘చాణక్య’… ట్రైలర్ విడుదల

గోపీచంద్ రా ఏజెంట్ గా నటించిన చాణక్య సినిమా ట్రైలర్ విడుదలైంది. మెహ్రీన్ ఈ మూవీలో హీరోయిన్. బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ మరో ముఖ్య పాత్ర పోషించింది.

తిరు కథ, కథనం, దర్శకత్వం అందించిన చాణక్య సినిమా… భారత్ – పాకిస్థాన్ నేపథ్యంలో తీశారు. కరాచీలో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించే రా ఏజెంట్ గా గోపీచంద్ నటించారు.

చావుకు భయపడని వాడు.. బుల్లెట్ కు భయపడడు అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్ తో 1 నిమిషం 59 సెకన్ల థియేట్రికల్ ట్రైలర్ ముగుస్తుంది. చాణక్యకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. దసరాకు చాణక్యను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

 

 

Latest Updates