ఆస్తి కోసం సవతి తల్లి దారుణ హత్య

Goshamahal constable-kills-his-step-mother-for-property-

హైదరాబాద్ మాదన్నపేట్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సవతి తల్లిని గోశామహల్ ఎ ఆర్ కానిస్టేబుల్ దారుణంగా చంపాడు. తండ్రి చనిపోయి 2 నెలలు గడవక ముందే ఆస్తి కోసం సవతి తల్లిని అతి దారుణంగా నరికాడు. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయబస్తీలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. మాదన్నపేట కు చెందిన యాదయ్యకు ఇద్దరు భార్యలు. ఈ మధ్య కాలంలోనే యాదయ్య అనారోగ్యంతో చనిపోయాడు. దహన సంస్కారాల కార్యక్రమంలో కూడా పెద్ద భార్య కొడుకు కానిస్టేబుల్ శ్రీకాంత్ ఆస్తి కోసం గొడవ పడటంతో స్థానిక పోలీసులు వచ్చి సముదాయించి సర్ది చెప్పారు. బతికి ఉన్నప్పుడే తండ్రి శ్రీకాంత్‌కు బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో కోటి రూపాయల విలువ చేసే ఇల్లు, మాదన్నపేటలో మరో ఇల్లు ఇవ్వడం జరిగింది. తండ్రి రెండో భార్యకు ఇచ్చిన ఆస్తి తనకే కావాలని మంగళవారం ఉదయం మాదన్నపేట్‌లో ఉండే సవతి తల్లి ఇంటికి వచ్చి.. ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లల కళ్లలో కారం చల్లి సవతి తల్లి సుకన్య మెడను కోసి అతి దారుణంగా చంపేశాడు. కళ్ల ఎదుటే తల్లి హత్య చూసిన ఇద్దరు పిల్లలు భయబ్రాంతులకు గురై కోలుకోలేని పరిస్థితిలో పడిపోయారు. ఈ ఘటన జరిగిన అనంతరం కానిస్టేబుల్ పరారయ్యాడని తెలుస్తోంది. స్థానిక సమాచారం రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం.

Latest Updates