RTC లో కొత్త కండక్టర్లు, డ్రైవర్ల రిక్రూట్మెంట్ కు ప్రభుత్వం ఏర్పాట్లు

RTC లో కొత్త కండక్టర్లు, డ్రైవర్ల నియామకానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రవాణాశాఖ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్ల నియామకానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని  అధికారులకు సూచించినట్టు సమాచారం. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నరట. ఒకటి, రెండు రోజుల్లో కొత్త కార్మికుల నియామకాల ఫైల్ ను ప్రభుత్వానికి ఇచ్చే ఛాన్స్ ఉంది. రిపోర్ట్ ను పరిశీలించిన తర్వాత రిక్రూట్ మెంట్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Latest Updates