‘కాజీపేట జంక్షన్ ను డివిజన్ స్థాయికి అప్ గ్రేడ్ చేయాలి’

ఢిల్లీ: కాజీపేట జంక్షన్ ను డివిజన్ స్థాయికి అప్ గ్రేడ్ చేయాలని  కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ను కోరినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న వినయ్ భాస్కర్ అక్కడ  పీయూష్ గోయెల్ మరియు ఆర్కియాలజీ డైరెక్టర్ జనరల్ ను కలిశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  తన నియోజకవర్గ పరిధిలో రైల్వే ప్రాజెక్టు, చరిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని, విభజన చట్టంలో హామీ మేరకు కాజిపేట్ లో తక్షణమే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు.” కాజిపేట్ స్టేషన్ లో కొన్ని రైళ్లు హల్ట్ జరగాల్సి ఉంది. వరంగల్ లో ఉన్న రైల్వే స్టేడియంని అభివృద్ధి చేయాలి” అని అన్నారు.

ఆర్కియాలజీ అధికారులను కూడా కలిసామని, వేయి స్తంభాల ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరామని వినయ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూలిన వాటిని తిరిగి నిర్మాణం చేపట్టాలని కోరామన్నారు. నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా..  అందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. వరంగల్ నగరంలో పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేస్తున్నారని వినయ్ భాస్కర్ అన్నారు. కేంద్రం కూడా అందుకు తగిన సహాయం చేయాలని కోరారు.

Latest Updates