జడ్జిల పెంపుపై కేంద్రానికి సుప్రీం ఝలక్

న్యూ ఢిల్లీ: జడ్జిల పదోన్నతుల విషయంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఇద్దరు జడ్జిల పదోన్నతులపై కేంద్రం అభ్యంతరాలను గురువారం కొట్టిపారేసింది. జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అనిరుద్బోస్, గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బోపన్న పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి సుప్రీం కొలీజియం ఏప్రిల్ 12న సిఫార్సుచేసింది. దీనిపై కేంద్రం అభ్యంతరాలు తెలిపింది. ఈ అభ్యంతరాలను కొట్టివేస్తూ కొలిజియం చేసిన సిఫార్సులను మరోసారి పునరుద్ఘా టించింది. వీరితో పాటు బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగాఉన్న జస్టిస్ గవాయ్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ పేర్లూ ప్రతిపాదించింది. సీనియారిటీతో పాటు, యోగ్యతను పరిగణలోకి తీసుకోవాలని చీఫ్ జస్టిస్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల కొలీజియం అభిప్రాయపడింది.జడ్జిల పోటీతత్వం, ప్రవర్తన, సమగ్రతలపై ఎలాంటి
ప్రతికూల అంశాలు లేవని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ప్రస్తుతం 27 మందే ఉన్నారు.

Latest Updates