ట్రాన్స్ పోర్ట్ డ్యాక్యుమెంట్స్ రెన్యూవల్ కు గడువు పొడిగింపు

Government extends validity of motor vehicle documents till September 30

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ : ట్రాన్స్ పోర్ట్ డాక్యుమెంట్స్ రెన్యువల్ ను గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి ఒకటి నాటికి ముగిసే అన్ని ట్రాన్స్ పోర్ట్ డ్యాకుమెంట్స్ కు సెప్టెంబరు 30 వరకు ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఫిట్ నెస్, పర్మిట్స్, లెర్నింగ్, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ రెన్యూవల్ గడువు సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ డ్యాకుమెంట్స్ రెన్యువల్ ప్రాసెస్ ఆగిపోయింది. దీంతో ఈ ఏడాది మార్చి 30 నాడే జూన్ 30 వరకు ఎక్స్ టెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా దీన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

Government extends validity of motor vehicle documents till September 30

 

 

Latest Updates