యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం

కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేశ్‌‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రైతులకు యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మీడియాకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత అనుభవం ఉన్నప్పటికీ సరైన జాగ్రతలు తీసుకోకపోవడం, అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలంకావడం వల్లే కొరత ఏర్పడిందని చెప్పారు.

నిజామాబాద్, జనగామ, సూర్యాపేట, నల్గొండ, నిర్మల్, వరంగల్ తదితర జిల్లాల్లోయూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్నారని అన్నారు. బఫర్ నిల్వలు పెట్టుకోవడంలో నిర్ల‌క్ష్ల చేయడం కూడా ఇందుకు కారణమని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates