దళితులను, గిరిజనులను ప్రభుత్వం మోసం చేసింది : భట్టి

రాష్ట్రంలోని దళితులను, గిరిజనులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన భట్టి.. వారి అభివృద్ధికి ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పనులనే TRS ప్రభుత్వం తాను చేసినట్లు ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఆదివాసీల కోసం అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చి వారికి భూములు పంపిణీ చేశామన్నారు. అప్పుడు ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటున్నారు. ఆదివాసీల భూములను తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు భట్టి.

 

Latest Updates