రిజిస్ట్రేషన్ల పేరుతో ప్రభుత్వం తహసీల్దార్లకు టార్గెట్లు పెడుతోంది

భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే అధికారాలను తహసీల్దార్లకే కాకుండా ఆర్డీఓలకు అప్పగించాలన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ న్యూ డైరీ, క్యాలెండర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయాల్లో పని విభజన చేయాలని సూచించారు. వీరు రిజిస్ట్రేషన్లపైనే ఎక్కువగా వర్క్ చేయడంతో విద్యార్ధులకు సర్టిఫికెట్లు రావడానికి ఆలస్యం అవుతోందన్నారు. రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్లు పెట్టడంతో తహసీల్దార్లు దానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పే ప్రభుత్వం…అదనపు భారం మోపుతూ తహసీల్దార్లు, వీఆర్వోలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కొత్త ఉద్యోగాలకు ఇప్పటి వరకు నోటిఫికేషన్లు ఇవ్వలేదని… ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రమోషన్లు నిలిచిపోయాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Latest Updates