మున్సిపల్ శాఖలో 3 వేల ఉద్యోగాల భర్తీకి ప్లాన్

హైదరాబాద్‌‌, వెలుగుమున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో 3 వేల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ పోస్టులు అలాట్‌‌ చేయనున్నారు. పాత మున్సిపాలిటీల్లోని ఖాళీలను కూడా వీటితో కలిపి ఫిలప్​ చేసేందుకు ప్రపోజల్స్‌‌ సిద్ధం చేస్తున్నారు. 40 వేల జనాభా గల మున్సిపాలిటీలో కనీసం 36 పోస్టులు అవసరముండగా, కొత్త మున్సిపాలిటీల్లో ముగ్గురు, నలుగురుకు మించి అధికారులు, సిబ్బంది లేరు. ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తలపెట్టడంతో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని సీఎం ఇదివరకే హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే దానికి అవసరమైన ప్రాసెస్​ను కమిషనర్​అండ్​ డైరెక్టర్​ ఆఫ్​ మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​అధికారులు మొదలుపెట్టారు.

సీడీఎంఏ పరిధిలో 128 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 3 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు లెక్కతేల్చారు. 2018లో 173 గ్రామ పంచాయతీలు 75 కొత్త మున్సిపాలిటీలుగా మారగా, మరో 131 గ్రామ పంచాయతీలు 42 పాత మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఆఫీసర్‌‌ (కేటగిరి-3), సీనియర్‌‌ అసిస్టెంట్‌‌, జూనియర్‌‌ అసిస్టెంట్‌‌, బిల్‌‌ కలెక్టర్లు 240 మందిని మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేటివ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో మెర్జ్‌‌ చేస్తూ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌‌13న జీఓ ఇచ్చింది. కొత్త మున్సిపాలిటీల్లో కమిషనర్లు, ఇంజనీర్లకు అదనంగా ఉన్న రెగ్యులర్‌‌ పోస్టులు ఇవి మాత్రమే. అనేక మున్సిపాలిటీలకు ఎంపీడీవోలు, ఇతర అధికారులు ఇన్‌‌చార్జి కమిషనర్లుగా వ్యవహరిస్తుండగా, ఇంజనీర్లు అదనపు బాధ్యతల్లో డ్యూటీలు చేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కోసం వంద ఇంజనీర్‌‌ పోస్టులు అవసరమని అంచనా వేశారు. మిగతా 2,900 మినిస్టీరియల్‌‌ పోస్టులు భర్తీ చేస్తే ఆయా పట్టణాల్లో అడ్మినిస్ట్రేషన్​ వ్యవహారాలు సాగించడానికి వీలవుతుందని ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. పోస్టులను టీఎస్‌‌పీఎస్సీ ద్వారా ఫిలప్​చేస్తారా, లేదా వేరే రిక్రూటింగ్‌‌ అథారిటీకి అప్పగిస్తారా అనే విషయంలో క్లారిటీ లేదని సీడీఎంఏ అధికారులు చెప్పారు. ప్రతిపాదనలు మాత్రమే అందజేస్తున్నామని, రిక్రూట్‌‌మెంట్‌‌పై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Latest Updates