కరోనా భయం..సర్కార్ ఆఫీసులు బంద్

రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు కరోనా బుగులు పట్టుకుంది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు పాజిటివ్ వస్తుండటంతో సర్కారు కార్యాలయాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. సీఎంవో, బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ, పలు కలెక్టరేట్ లో ఉద్యోగుల హాజరు సగానికిసగం పడిపోయింది. కొన్ని డిపార్ట్మెంట్లు, ఆఫీసులు పూర్తిగా బందయ్యాయి. కేసులు పెరగడంతో ఉద్యోగులు కూడా ఆఫీసులకు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో పనులన్నీ ఎక్కడికక్కడ పెండింగ్ పడిపోయాయి. సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో .. సెక్రటేరియట్ లోని ఓ కీలక శాఖలో ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్ రావటంతో ఉద్యోగుల హాజరు తగ్గిపోగ్గియింది. ఓ పెద్దాఫీసర్ మీటింగ్ పెట్టిన తర్వాతే కేసులు బయటపడటంతో ఆ అధికారి కూడా హోం క్వారంటైన్ కు వెళ్లినళ్లిట్లు తెలుస్తోంది. దీని ఎఫెక్ట్ మిగతా డిపార్ట్మెంట్లపైనా పడటంతో వాటిల్లో ఉద్యోగుల హాజరు 50 శా తం, 25 శాతానికి పడి పోయింది. బీఆర్కే భవన్ పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ అటెండర్, డ్రైవర్ కు వైరస్ సోకడంతో మేయర్ చాంబర్ ఉండే ఫ్లోర్ మొత్తం ఖాళీ అయ్యింది.

ఉద్యోగులు అంతంత మాత్రంగానే వస్తున్నారు. పాజిటివ్ కేసులు వచ్చిన ఫ్లోర్లను మూడు రోజుల పాటు శానిటైజ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగికి పాజిటివ్ రావటంతో ఆ ఫ్లోర్ లో కూడా ఉద్యోగులు రావటం లేదు. మిగతా ఫ్లోరలో కూడా ఉద్యోగులు భయం భయంగానే డ్యూటీకి వస్తున్నారు. సీఎంవో  క్లోజ్.. 30 మందికి టెస్టులు బేగంపేట మెట్రో కార్యాలయంలో కొనసాగుతున్న సీఎంవోలో ఓ ఉన్నతాధికారి పీఏకు పాజిటివ్ రావటంతో ఆ భవనం మొత్తాన్ని మూసేశారు. కొన్ని రోజుల పాటు డ్యూటీలకు రావొద్దని ఉద్యోగులను ఆదేశించారు. అధికారులు కూడా ఇంటి నుంచే ఫైళ్లు క్లియర్  చేస్తున్నారు. సీఎంవోలో పనిచేస్తున్న 30 మంది శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపారు. ఇందులో సీనియర్ ఐఏఎస్ లు, పేషీ ఉద్యోగులు, అటెండర్లు, స్టాఫ్, డ్రైవర్లు ఉన్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గన్ మెన్ కు పాజిటివ్ రావటంతో ఆయన కార్యాలయానికి రానని, వారం పాటు కమిషన్ కార్యాలయం మూసేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి హరీశ్ రావు పీఏకు పాజిటివ్ రావడంతో ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లారు. జిల్లా కార్యాలయాలు కూడా మూత జిల్లాల్లో నూ కరోనా ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది. ఇప్ప టికే యాదాద్రి జెడ్పీ సీఈవోకు పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. యాదాద్రి కలెక్టర్  అనితా రామచంద్రన్ కూడా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి ఏర్పాటు చేసిన మీటింగ్ కు హాజరైన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. కలెక్టర్   ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ కు వెళ్లారు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు జిల్లాల కలెకరేట్లలో ఉద్యోగుల హాజరు కూడా తగ్గిపోయింది. రానున్నరోజుల్లో మరిన్ని ప్రభుత్వకార్యాలయాలు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Latest Updates