హైకోర్ట్ ఆదేశాలతో కదిలిన సర్కార్.. ప్రైవేట్ హాస్పిటళ్లల్లో 50% బెడ్లు ప్రభుత్వానికే..

కరోనా ట్రీట్ మెంట్ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులు తీసుకోవలసిన  చార్జీలను కూడా ప్రభుత్వమే నిర్ణయించి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది వైద్య ఆరోగ్యశాఖ. కరోనాకు చికిత్స అందిచండం కోసం ప్రభుత్వం తో కలిసి రావాలని మొదటి రోజు నుండి ప్రైవేట్ ఆస్పత్రులను కోరుతోంది. అయితే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అడ్డగోలుగా చార్జీలు చేయడంతో పలు ఆస్పత్రుల పై లిఖిత పూర్వక ఫిర్యాదులు అందాయని తెలిపింది.

అంతేకాదు  రూల్స్ పాటించని హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన  వైద్య ఆరోగ్య శాఖ… పాటు పలు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. మిగిలిన వాటికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. సంక్షోభ సమయంలో వ్యాపారం చేయవద్దని అనేక సార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్… అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులను కోరారు. ఈ క్రమంలో మంత్రి ఈటల తో భేటీ అయిన ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులు.. ప్రతి ఆస్పత్రిలో 50 శాతం బెడ్లను ప్రభుత్వానికి అందించడానికి అంగీకరించారు. వీటిలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే వైద్య సేవలు అందించబోతున్నారు. అంతేకాదు ఈ బెడ్స్ ను  వైద్య ఆరోగ్యశాఖ నింపనుంది. ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు పేషంట్లను వైద్య ఆరోగ్య శాఖ పంపించేందుకు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అంగీకరించాయి.

50 శాతం బెడ్స్ ప్రభుత్వం అందించడానికి ముందుకు వచ్చిన ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక.. విధివిధానాలు రూపొందించేందుకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు తో రేపు(శుక్రవారం) భేటీ కావాల్సిందిగా హాస్పిటల్ యాజమాన్యాలను కోరారు.

Latest Updates