చిరుద్యోగులకు శుభవార్త: మరో మూడు నెలలు కొనసాగనున్న ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్

కరోనా వైరస్ తో ఆర్ధికంగా నష్టపోయిన  చిరుద్యోగులకు మరో మూడు నెలల పాటు పీఎఫ్ ను అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.  ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన చిరుద్యోగులకు  మార్చి, ఏప్రిల్, మే  నెలల పీఎఫ్ ను కేంద్రం  ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసింది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ పథకాన్ని మరో మూడు నెలల పాటు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేబినెట్ సమావేశంలో పీఎంజీకేవై / ఆత్మనిర్భర భారత్ పథకం కింద జూన్ నుంచి ఆగస్ట్ వరకు 15 వేల లోపు జీతం ఉన్న ఉద్యోగులకు పీఎఫ్ ను అందిస్తుంది. ఆ భారాన్ని కేంద్రమే భరించనుంది. సాధారణంగా ఉద్యోగి వేతనంలో 12శాతం, సంస్థ నుంచి 12 శాతం నిధిని ఉద్యోగికి పీఎఫ్ గా అందిస్తాయి. కానీ కరోనా కారణంగా మొత్తం పీఎఫ్ ను కేంద్రమే భరిస్తుంది. రూ .4,860 కోట్ల అంచనా వ్యయంతో 72లక్షల మందికి ఆ మొత్తాన్ని అందించేలా కేంద్రం ప్రకటించింది.

Latest Updates