ఆడపిల్లల వివాహ కనీస వయస్సు త్వరలోనే ప్రకటిస్తాం : ప్రధాని

సంబంధిత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దేశంలో ఆడపిల్లల కనీస వయస్సు  ప్రకటిస్తామని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో ఆడపిల్లల వివాహ వయసు పై చర్చజరుగుతుందన్న మోడీ..సంబంధిత కమిటీ ఇంకా నిర్ణయం ఎందుకు తీసుకోలేదంటూ దేశ వ్యాప్తంగా ఆడపిల్లల తనకు లేఖరాశారని తెలిపారు. త్వరలోనే వివాహ వయసుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) 75 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ 75 రూపాయల స్మార‌క నాణాన్ని విడుదల చేశారు. దేశంలో ఉన్న మహిళల కోసం జల్ జీవన్ మిషన్ ద్వారా  ప్రతి ఇంటికి నీరు అందించే పని జరుగుతోంది. ఒక్కొక్కరికి 1 రూపాయల చొప్పున శానిటరీ ప్యాడ్ అందిస్తున్నట్లు చెప్పారు.

కాగా గత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా మాట్లాడుతూ దేశంలో మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సు పై కేంద్ర పునపరిశీలనలో ఉన్నది నిజమేనా అని ప్రశ్నించారు. దీనిపై కేంద్రమంత్రి స్పృతీ ఇరానీ స్పందించారు. దేశంలో శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు,  సంతానోత్పత్తి  , పుట్టుక, మహిళల ఆరోగ్యం మరియు పోషణకు సంబంధించిన ఇతర సంబంధిత అంశాల ఆధారంగా దేశంలో మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సు పై ఎంపీ సుశీల్ కుమార్ గుప్తాకు లిఖిత పూర్వక సమాధానం ఇస్తామని  స్పృతీ ఇరానీ హామీ ఇచ్చారు.

దీనిపై  స్పృతీ ఇరానీ మహిళల కనీస వివాహ వయస్సును నిర్ధారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలో ఈ కమిటీ ఇచ్చిన  నివేదిక వివాహ వయస్సులో మార్పులు చేసే అవకాశం ఉందన్నారు.

Latest Updates