ప్రైవేట్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటే పైసలియ్యం

  • పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
    చండీఘర్ : కరోనా లక్షణాలతో ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన వారి ఖర్చులు ప్రభుత్వం భరించదని పంజాబ్ స్పష్టం చేసింది. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన హాస్పిటల్స్ ఉన్న వారికి మాత్రమే ఫ్రీ ట్రీట్ మెంట్ అని రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రైవేట్ లో చేరిన వారంతా ఖర్చు సొంతంగా భరించాల్సిందేనన్నారు. కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి పంజాబ్ గవర్నమెంట్ తరఫున పలు హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది. ఐతే కొంతమంది అనుమానిత లక్షణాలున్న వారు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ జాయిన్ అయ్యారు. ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని వారంతా భావించారు. కానీ పంజాబ్ ప్రభుత్వం ఈ ఖర్చు భరించలేమని తేల్చిచెప్పింది. అదే విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ అమరీందర్ సింగ్ హోంమంత్రి అమిత్ షా కు లెటర్ రాశారు. కరోనాపై పోరులో రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉండాలని లెటర్ లో పేర్కొన్నారు.

Latest Updates