కిషన్ రెడ్డికి గవర్నర్, సీఎం సంతాపం : అంత్యక్రియలకు KTR హాజరు

రాజ్ భవన్ : BJP నాయకుడు కిషన్ రెడ్డి తల్లి గంగాపురం అండాలమ్మ మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కిషన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన గవర్నర్ .. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కిషన్ రెడ్డి తల్లి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంత్యక్రియలకు కేటీఆర్ హాజరు

ఈ మధ్యాహ్నం కిషన్ రెడ్డి తల్లి అండాలమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Latest Updates