టీబీపై యాక్షన్ ప్లాన్‌కు గవర్నర్ ఆదేశాలు

మార్చిలో టీబీపై స్పెషల్ డ్రైవ్

వారంలోపు యాక్షన్​ ప్లాన్​ రెడీ చేయండి

హెల్త్​ ఆఫీసర్లకు గవర్నర్​ తమిళిసై ఆదేశం

రాష్ట్రంలో టీబీ అనేదే లేకుండా చేయాలని సూచన

టీబీ కేసులు పెరుగుతున్నాయనే వార్తలతో ఎమర్జెన్సీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో టీబీ లేకుండా చేయడానికి వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని హెల్త్ ఆఫీసర్లను గవర్నర్ తమిళిసై సౌందర్‌‌రాజన్ ఆదేశించారు. రాష్ట్రంలో టీబీ కేసులు పెరుగుతున్నాయని వచ్చిన వార్తలకు గవర్నర్​ స్పందించారు. గవర్నమెంట్​ ఏం చర్యలు తీసుకుంటుందో తెలుసుకోవడానికి బుధవారం రాజ్‌భవన్‌లో స్టేట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రివ్యూ చేశారు. 2018తో పోల్చితే 2019లో 18 వేల కేసులు ఎక్కువగా నమోదు కావడంపై ఆరా తీశారు. ఇంతకుముందు ప్రభుత్వ దవాఖాన్లలో నమోదయ్యే కేసులనే గుర్తించేవాళ్లమని, గతేడాది నుంచి ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదైన కేసులను నమోదు చేస్తుండడంతో సంఖ్య పెరిగిందని ఆఫీసర్లు గవర్నర్‌‌కు వివరించారు. ప్రతీ పేషెంట్ పూర్తిగా కోలుకునే వరకూ ట్రీట్​మెంట్​ఇవ్వాలని, దీని కోసం అవసరమైతే రెడ్‌క్రాస్‌, ఇతర ప్రభుత్వ శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. ఇంకా ఎంతమంది టీబీతో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి మార్చిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా స్లమ్స్‌, నైట్ షెల్టర్స్‌లో క్యాంప్‌లు నిర్వహించాలని సూచించారు. దీనికోసం రాజ్‌భవన్‌ జాయింట్ సెక్రటరీ రఘుప్రసాద్‌ను నోడల్ ఆఫీసర్‌‌గా నియమించారు. వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి నోడల్ ఆఫీసర్‌‌కు ఇవ్వాలని ఆదేశించారు.

For More News..

20 వేల ఏండ్ల కిందటి అలుగు.. చెక్కుచెదరని దేహం

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

మంగమ్మా.. ఏందమ్మా మీ సమస్య? కలెక్టర్‌నంటూ పరిచయం చేసుకొని..