వీడియో వైరల్.. దర్బార్ పాటకు చిందేసిన కిరణ్ బేడి

చెన్నై: పుదుచ్చేరిలో పొంగల్ వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకలలో భాగంగా ఆ రాష్ట్ర గవర్నర్ కిరణ్ బేడి ప్రజలతో కలిసి డ్యాన్స్ వేశారు. దర్బార్ సినిమాలోని చిలుక పాటకు కొంతమంది విదేశీయులతో కలిసి డ్యాన్స్ చేస్తూ జనం అదరగొట్టారు. అదే సమయంలో గవర్నర్ కిరణ్ బేడి సైతం ఆ పాటకు స్టెప్పులేస్తు సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేడుకల అనంతరం కిరణ్ బేడి పేదలకు బట్టలు పంపిణీ చేశారు.

Latest Updates