బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం

హైదరాబాద్ , వెలుగు: ముస్లింలకు గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ,సీఎం కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు బక్రీద్ ప్రతీక అని గవర్నర్ అన్నారు. పేదలకు సాయం చేయాలన్న గొప్ప సందేశాన్ని పండుగ ఇస్తుందన్నారు.త్యాగం, కరుణ, సహనాన్ని బక్రీద్ చాటి చెప్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.