యాదాద్రి: స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు గవర్నర్ నరసింహన్ దంపతులు. వసంత పంచమిని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి వచ్చిన గవర్నర్ దంపతులకు.. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, ఈవో. స్వాతి నక్షత్ర పూజలు నిర్శహించిన పూజారులు.. స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు.  గవర్నర్ వెంట బిసి కార్పోరేషన్ చైర్మెన్ రాములు, మణిపూర్ ఛీఫ్ జస్టీస్ రామలింగం సుధాకర్ దంపతులు, ఎమ్మెల్యే సునిత ఉన్నారు.

 

Latest Updates