పండుగల వలన మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయి

తెలంగాణ బిడ్డ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ జలవిహార్ లో  అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందరరాజన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గరువారం జరిగిన ఈ కార్యక్రమంలో… తెలుగులో మాట్లాడిన తమిళిసై తెలంగాణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని అన్నారు. గొప్పనైన తెలంగాణ సంసృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఐదురోజులపాటు రాజ్ భవన్ లో నిర్వహించామని తెలిపారు. పండుగల వలన మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయని అన్నారు. నగరంలో 33శాతం మంది ఒబేసిటీతో బాధపడుతున్నారని… టిఫిన్ బాక్సులలో పిల్లలకు, మగవారికి బర్గర్, పిజాలు పెట్టి ఆఫీస్ కు పంపకండని కోరారు. తెలంగాణా ఫుడ్ బాగుందని ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే వారికి ఇంటి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టండని ఆమె తెలిపింది. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Latest Updates