యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై దంపతులు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు ఇవాళ ఉదయం యాదాద్రి నృసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అర్చకులు వేదాశీర్వచనాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు గవర్నర్ దంపతులకు, మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలయ ఈవో, అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను మంత్రి జగదీశ్ రెడ్డి… గవర్నర్‌కు వివరించారు.

Latest Updates