‘మోడ్రన్​గా ఉండండి… మన కల్చర్​ మరువకండి’

  • ఫీల్డ్​లో ఫెయిలైతే సూసైడ్ కరెక్ట్​ కాదు
  • నిలిచి గెలిచి చూపించాలి
  • యూత్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో గవర్నర్ తమిళిసై

నాంపల్లి, వెలుగు: ఆధునిక జీవన శైలిని ఎంజాయ్ చేస్తూనే…యువత దేశ సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించాలన్నారు  గవర్నర్ తమిళసై సౌందరరాజన్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పేరుతో నిర్వహించిన యూత్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

యువత ఏ రంగాన్ని ఎంచుకున్నా సంతోషంగా ముందుకు సాగాలన్నారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. నవభారత నిర్మాణంలో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా  హాజరయ్యారు. అనుకున్న రంగంలో రాణించలేనప్పుడు మరో రంగాన్ని ఎంచుకోవాలే తప్ప… ఆత్మహత్యలు సరికాదన్నారు. నిలిచి గెలిచి చూపించినవాళ్లే ఆదర్శంగా నిలుస్తారన్నారు.

సుభాష్ చంద్రబోస్ ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ పోటీ పరీక్షల్లో 4వ ర్యాంక్​ సాధించారని, అయినా భారత్​కు స్వాతంత్య్రం తేవడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని కూడా వదిలేశారన్నారు. తాను డాక్టర్​చదివానని, ఎక్స్​పర్ట్​ కావడం కోసం ఫారిన్​లో కోర్సులు చేశానన్నారు. అయినా మన దేశంలోనే సర్వీస్​ చేశానన్నారు. నల్గొండ జిల్లా ఫ్రెండ్స్ యూత్ క్లబ్ కు రూ.లక్ష క్యాష్​తో పాటు స్టేట్​ లెవెల్​పురస్కారాన్ని అందజేశారు.అలాగే రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బెస్ట్​యూత్​ క్లబ్​ను ఎంపిక చేసి రూ.25 వేల చొప్పున క్యాష్​ప్రైజ్​ ఇచ్చారు.  ఐఏఎస్ ఆఫీసర్​ అబ్దుల్ అజీజ్ , నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ రాష్ట్ర ఇన్​చార్జి ప్రమోద్ హెగ్డే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈనెల 9న ప్రారంభమైన ఏక్ భారత్ కార్యక్రమం గురువారంతో ముగిసిందన్నారు నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర సంచాలకులు ప్రమోద్ హింగే. ఈ క్యాంప్ లో తెలంగాణ, హరియాణా నుంచి 100 మంది యువత పాల్గొన్నారని చెప్పారు. రెండు రాష్టాల యువకులు వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలను పంచుకున్నారని తెలిపారు. ఈ 15 రోజుల క్యాంప్ లో ఎన్నో నేర్చుకున్నామంటున్నారు ఐఏఎస్ ఆఫీసర్ అబ్దుల్ అజీమ్.

 

Latest Updates