వ్యాక్సిన్ కోసం సైంటిస్టులు రాత్రిపగలు కష్టపడుతున్నారు

హైదరాబాద్: భారత్ బయోటిక్ సింటిస్టులు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 2020లోనే వచ్చే అవకాశం ఉందన్నారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. తక్కువ ధరకే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే చాన్సుందన్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం సైంటిస్టులు రాత్రి పగలు కష్ట పడుతున్నారన్నారు . సైంటిస్టులకు ధన్యవాదాలు తెలిపేందుకు శామీర్ పేట్ లోని భారత్ బయోటిక్ కు వచ్చానన్నారు గవర్నర్.

ఈ సందర్భంగా కొవిడ్ వ్యాక్సిన్ త‌యారీలో భాగ‌స్వాములైన శాస్ర్త‌వేత్త‌ల‌తో గ‌వ‌ర్న‌ర్ కాసేపు మాట్లాడారు. శాస్ర్త‌వేత్త‌లు వ్యాక్సిన్‌పై అత్యంత శ్ర‌ద్ధ పెట్టి ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌ధాని మోడీ చెప్పిన‌ట్లు భార‌త్ ‌లోనే క‌రోనా వ్యాక్సిన్ త‌యారీకి అవ‌కాశాలు ఎక్కువ అన్నారు. ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు రాకుండా వ్యాక్సిన్ త‌యారీపై దృష్టి పెట్టార‌ని చెప్పారు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.

Latest Updates