
దేశంలో పవర్ ఫుల్ పర్సన్ ఓటర్లేనన్నారు గవర్నర్ తమిళి సై. రవీంద్రభారతిలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తమిళి సై .. ప్రతీ ఒక్కరూ కులం,మతం,డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసి ఓటు విలువ కాపాడాలంటూ ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. దేశంలోనే మొదటగా తెలంగాణలో ఫేస్ యాప్ ద్వారా దొంగ ఓట్లను గుర్తించే పద్ధతిని తీసుకొచ్చారన్నారు. ఒక ఓటరుగా తాను గర్వపడుతున్నానన్నారు. ప్రజా స్వామ్యంలో ఓటు విలువ గొప్పదన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి, గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న పక్కింటివారితో, బంధువులతో వేయించాలన్నారు. ఓటర్లలో చైతన్యం తీసుకురావాలన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. నిజామాబాద్ లో 12 ఈవీఎంలతో 1085 మంది అభ్యర్థులతో ఎన్నికను నిర్వహించి జాతీయ స్థాయిలో రికార్డు సాధించామన్నారు.