తక్కువ  టైంలోనే  రాష్ట్రం పురోగతి

అభివృద్ధిలో  దేశంలోనే  తెలంగాణ  ఫస్ట్ ప్లేస్ లో  ఉందన్నారు గవర్నర్ తమిళిసై.  తక్కువ  టైంలోనే  రాష్ట్రం  ఎంతో పురోగతి సాధించిందని  తెలిపారు. విద్యుత్ కొరత,   రైతుల ఆత్మహత్యలు సవాల్ గా  నిలిచాయన్నారు. విద్యుత్,  వ్యవసాయ రంగంలో  రాష్ట్రం దూసుకెళ్తుందన్నారు  గవర్నర్. గత ఆరేళ్లలోనే  వ్యవసాయం రంగంలో  ఎన్నో మార్పులు  వచ్చాయని తెలిపారు. తెలంగాణ  ప్రజల అవసరాలకు  అనుగుణంగా  పాలన సాగుతోందన్నారు  గవర్నర్. రాష్ట్రంలో  సంక్షేమ పథకాలతో  పేదల జీవితాల్లో  వెలుగులు చూస్తున్నామన్నారు .  అన్ని వర్గాల  పేదలకు  పెన్షన్లు అందుతున్నాయన్నారు.  957  రెసిడెన్షియల్  స్కూల్స్  సక్సెస్ ఫుల్ గా  నడుస్తున్నాయని  తెలిపారు. SC, ST  వర్గాలకు  బడ్జెట్ లో భారీగా నిధులు  పెంచామన్నారు గవర్నర్…. రైతు బంధు,  రైతు బీమా పథకాలు  చరిత్రాత్మకం  అన్నారు. మన పథకాలు  ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా  నిలుస్తున్నాయన్నారు.