యాదాద్రి పనులు పరిశీలించిన గవర్నర్

యాదాద్రి  ఆలయ నిర్మాణ  పనులు  అనుకున్న విధంగానే  జరుగుతున్నాయన్నారు  గవర్నర్ నరసింహన్.  త్వరలోనే  స్వామివారు స్వయంభుగా  వెలిసిన  చోట  దర్శనమిస్తారని  చెప్పారు. ఆదివారం వసంత పంచమి సందర్భంగా యాదాద్రిలో స్వామిని దర్శించుకున్నారు గవర్నర్ దంపతులు. ఆలయ నిర్మాణ పనులను గవర్నర్ పరిశీలించారు. వైటీడీ అధికారులు, అర్చకులను నిర్మాణ పనులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అంతకుముందు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని  దర్శించుకొని.. ప్రత్యేక  పూజలు చేశారు గవర్నర్ దంపతులు. ఆలయ అర్చకుల ప్రత్యేక  ఆశీర్వచనం తీసుకున్నారు. దాదాపు  అరగంట పాటు  ఆశీర్వచనం  చేయడంతో, అర్చకులను అభినందించారు  గవర్నర్.  రాష్ట్ర ప్రథమ  పౌరుడినైన  తనకు  ఇలాంటి ఆశీర్వచనం  దక్కడమంటే..  రాష్ట్ర ప్రజలందరికీ  దక్కినట్లే  అన్నారు.

Latest Updates