ముస్లింలకు గవర్నర్ రంజాన్ విషెస్‌

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు చెప్పారు. పవిత్ర ఖురాన్ లోని బోధనలు యుగాలుగా సమాజంలోని జీవితాలను తీర్చిదిద్దుతున్నాయన్నారు. కఠినమైన స్వీయ క్రమశిక్షణతో జీవితం ఉద్దేశాన్ని రంజాన్ గుర్తు చేస్తోందని చెప్పారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు, వాటి నుంచి బయటపడేందుకు రంజాన్ లాంటి పర్వదినాలు హెల్ప్ చేస్తాయన్నారు.

  • ఇంట్లో నే ఉండి రంజాన్ చేసుకోండి: సీఎం

రంజాన్‌ పర్వదినం మత సామరస్యానికి ప్రతీక అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గంగా జమునా తెహజీబ్‌‌కు రంజాన్‌ ప్రతీకగా నిలుస్తుందన్నారు.ముస్లిం లందరూ ఇంట్లోనే ఉంటూ రంజాన్‌ పండుగ జరుపుకోవాలని సూచిం చారు. రంజాన్‌ మాసం వారిలో సంతోషాన్ని తీసుకువచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎంవో ప్రకటన విడుదల చేసింది.

మాస్క్ అవసరం కాదు అలవాటైపోయింది

Latest Updates