జూనియర్ డాక్టర్లపై దాడి కరెక్ట్ కాదు: పవన్

విజయవాడ,తిరుపతిలో జూనియర్ డాక్టర్ల పట్ల  ప్రభుత్వ వైఖరిని ఖండించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న జూనియర్ డాక్టర్లను కాలితో తన్నడం, చేయిచేసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఎంతో సేవ చేస్తున్న వారి డిమాండ్ పట్ల ప్రభుత్వం స్పందించకపోగా..వారిపై డాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎన్ఎంసీ బిల్లు వ్యతిరేకిస్తున్న జూనియర్ డాక్టర్లు,వైద్యులు వ్యతిరేకించడం పట్ల సమగ్ర విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు పవన్.

Latest Updates