మంచి గాలి కోసం 4,400 కోట్లు

ఢిల్లీ సహా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా లాంటి మెట్రో సిటీల్లో పొల్యూషన్ విపరీతంగా పెరగపోయింది. కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేని స్థితిలో ఈ నగరాల్లో ప్రజలు బతుకుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ అయితే గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందంటూ సుప్రీం కోర్టు అనేక సార్లు కామెంట్ చేసింది. గాలి కాలుష్యం దెబ్బకి స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ కోసం సరి బేసి లాంటి విధానాలతో రోడ్లపైకి వస్తున్న వాహనాల సంఖ్యను కంట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కాలుష్య నివారణ, స్వచ్ఛమైన గాలి కోసం బడ్జెట్‌లో స్కీం ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి.

అన్ని పెద్ద నగరాల్లో క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్స్ కోసం రూ.4,400 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు నిర్మలా సీతారామన్. సిటీల్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోవడం అన్నది ఆందోళన కలిగించే అంశమని అన్నారామె. ఈ నిధులను అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కల పెంపుతో పాటు కొత్త విధానాల రూపకల్పనకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.

Latest Updates