30ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా నిర్మాణానికి నోచుకోని బ్రిడ్జ్..స్వయంగా నిర్మించుకున్న గ్రామప్రజలు

30 సంవత్సరాల నుంచి రెండు గ్రామాల మధ్య ఓ బ్రిడ్జిని నిర్మించాలని, బ్రిడ్జి లేకపోవడం వల్ల పిల్లల ప్రాణాలు పోతున్నాయని గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మొర పెట్టుకున్నారు.

బ్రిడ్జ్ నిర్మాణం కోసం అధికారుల చుట్టూ తిరిగి వాళ్ల కాళ్లు అరిగిపోయాయే తప్ప బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోలేకపోయారు. దీంతో ఆ ఊరి ప్రజలే చందాలు వసూలు చేసుకొని స్వయంగా బ్రిడ్జిని నిర్మించారు.

బీహార్ లోని వజీర్‌గంజ్‌లోని బుధౌల్ గ్రామం నుంచి మదర్దిహ్‌ గ్రామానికి వెళ్లేందుకు 15కిలోమీటర్ల దూరం ఉంది. ఆ ఊరిలో రాకపోకలు జరిపేందుకు..ఊరిగ్రామాల మధ్య ప్రవహిస్తున్న నదిలో ఈదుకుంటూ వెళ్లేవారు.

1922లో ఆ ఊరి మధ్య ఉన్న రోడ్డు వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. అప్పటి నుంచి బ్రిడ్జి నిర్మించాలని పెద్ద ఉద్యమమే జరుగుతూ వచ్చింది. ఏళ్లు గడుస్తున్నాయే తప్ప బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోలేదు.

గతేడాది గ్రామాన్ని దాటేందుకు నదిలో దిగిన ముగ్గురు చిన్నారులు నీట మునిగి మరణించారు. దీంతో గ్రామ ప్రజలే చందాలు వేసుకొని బ్రిడ్జిని స్వయంగా నిర్మించుకున్నారు.

Latest Updates