ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్ పాత్రా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త డిప్యూటీ గవర్నర్ గా సీనియర్ ఆర్థిక వేత్త మైఖేల్ పాత్రా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన RBI లో పరపతి విధాన విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. RBIలో నాలుగో డిప్యూటీ గవర్నర్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఈ పదవికి పాత్రాను ఎంపిక చేయవచ్చని ముందు నుంచే అనుకుంటున్నారు. పాత్రా నియామకంపై ఇవాళ(మంగళవారం) ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతేడాది జూలైలో డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య రాజీనామా తర్వాత అప్పటి నుంచి నాలుగో డిప్యూటీ గవర్నర్ పోస్టు ఖాళీగా ఉంది.

 

Latest Updates