ఈ-సిగరెట్లను బ్యాన్ చేసిన కేంద్రం

ఈ-సిగరెట్లను నిషేధించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించారు. కేంద్ర నిర్ణయంతో  ఈ-సిగరెట్లకు సంబంధించిన తయారీ, దిగుమతి, ఎగుమతి, రవాణా, అమ్మకం, పంపిణీ, నిల్వలు, ప్రకటనలను కూడా  నిషేదిస్తున్నట్లు చెప్పారు. యువతలో 77 శాతం ఈ -సిగరెట్లు వాడుతున్నారని..ఇకపై ఈ- సిగరెట్లు వాడటం నేరమని అన్నారు.  వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను తీసుకొస్తామని చెప్పారు.

 

Latest Updates