అన్నీ ఇస్తమని ఆగం చేసింన్రు

  • ఆర్‌ ఆర్‌ ప్యాకేజీ అని ఐదేళ్లకు ఇంటి జాగలు
  • ఏండ్లుగా పునరావాస కాలనీకి ఏ సౌలత్‌ లేదు
  • కాంట్రాక్టర్ల మధ్య గొడవతో ఆగిన పనులు
  • దుండిగల్‌ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎక్స్‌‌టెన్షన్ లో నిర్వాసితులైన దాచారం, దార్గుల వాసుల గోస

 సంగారెడ్డి, వెలుగు: తాత ముత్తాతల నాటి ఇండ్లు, ఊరు ఇడిస్తిమి.. ఇంటికి ఇల్లు.. ఊరికి ఊరు కట్టిస్తమన్న ఆఫీసర్లు.. కట్టుబట్టలతో నడిరోడ్డుమీద నెలబెట్టిడ్రు. ఎనిమిదేళ్లు అవుతున్న ఎవ్వరూ మా గోస చూస్తలేరు. ఐదేళ్లు పోరాటం చేస్తే ప్లాట్లు ఇచ్చిన్రు ఇప్పటి వరకు కాలనీకి కరెంలే కాదు మంచినీళ్లు.. మట్టి రోడ్డు కూడా లేదు. మరోవైపు కాంట్రాక్టర్ల మధ్య లొల్లితో ఏండ్లుగా సౌ లత్‌‌ల పనులాగినా… సర్కార్‌‌ సప్పుడు జేస్తలేదు. దుండిగల్‌‌ ఎయిర్‌‌ఫోర్స్‌‌ అకాడమీ విస్తరణలో నిర్వాసితులైన దాచారం, దార్గుల వాసుల కన్నీటి కథ ఇది.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల శివారులోని దుండిగల్‍ ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ పక్కనే ఉన్న దాచారం, దార్గుల గ్రామాలను ఎనిమిదేళ్ల కింద ఖాళీ చేయించారు. పునరావాసం కల్పించి ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇండ్లు, పొలాలను అన్ని వదిలి ఎక్కడెక్కడో తలదాచుకున్నారు. ఐదేళ్ల పోరాటం తర్వాత జిన్నారం మండలం గడ్డపోతారం పంచాయతీ పరిధిలోని కిష్టాయిపల్లి శివారులో 166 సర్వే నెంబర్‍లో 304  కుటుంబాలకు 300 గజాల చొప్పున స్థలాలు కేటాయించారు. కొందరు  గుడారాలు, రేకులతో ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ కరెంట్‍, రోడ్లు, నీటి సౌకర్యం, డ్రైనేజీ వంటి సౌలత్‌‌లేవి కల్పించలేదు.

ఇండ్లు ఇయ్యలేదు..

దాచారం, దార్గుల రిహాబిలిటేషన్‍ కాలనీలో నిర్వాసితులకు ఇండ్లు కట్టియ్యాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కాలనీలో కనీస సౌకర్యాలు కూడా సమకూర్చకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్‌‌ కూడా లేకపోవడతో రాత్రిళ్లు పాములు, తేళ్లు తదతర విషపురుగులో ఇండ్లలోకి వస్తున్నాయంటున్నరు. 300లకు పైగా కుటుంబాలు సమస్యలపై ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకునేటోళ్లు లేకుండా పోయారు. కంటితుడుపు చర్యగా బోర్లు వేసినా వాటికి ఇంతవరకు మోటర్లు బిగించలేదు. దీంతో  మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిష్టయ్యపల్లి గ్రామానికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. రేషన్‍ కోసం గుమ్మడిదల, పెన్షన్‍ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువు కానుకుంటకు వెళ్లాల్సి వస్తోందని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆర్ఆర్ ప్యాకేజీ కింద 14 కోట్లు..

పునరావాస కాలనీలో డీఆర్‍డీ, ఆర్ఆర్ (రీకన్‌‌స్ర్టక్షన్‍ అండ్ రీహాబిలిటేషన్) ప్యాకేజీ కింద ఐదేళ్ల క్రితం 14 కోట్ల రూపాయలు అప్పటి కలెక్టర్ స్మితసబర్వాల్‍ మంజూరు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే మౌలిక వసతుల కోసం టెండర్లకు ముందే ఓ కాంట్రాక్టర్‍ భూమి చదును చేసి, రోడ్లు తదితర పనులకు సుమారు రూ.2.5 కోట్లు ఖర్చు చేశాడు. తీరా టెండర్ మరో కాంట్రాక్టర్‍కు దక్కడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిన సమస్య జఠిలమైంది. దీంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ఇక్కడ ఏ పనులు చేయోద్దని ఉత్తర్వులు ఉన్నట్టు సంగారెడ్డి ఆర్డీవో శ్రీను తెలిపారు..

ఏ దిక్కులేకుండ ఉన్నం

మా ఊర్లో 120 గజాల ఇల్లు , నాలుగు ఎకరాలపొలం ఉండేది. వ్యవసాయం చేసుకునిబతికేటోన్ని. ఊరు ఖాళీ చేయించి ఈడ పడేశారు.ఈ మధ్యనే యాక్సిడెంట్లో కాలు విరిగింది. నాకుఇద్దరు ఆడపిల్లలు . అప్పు చేసి ఒకరి పెండ్లి చేసిన.ఖాళీ చేయించేటప్పుడు ఇక్కడే ఏదోఒక ఉపాధిచూపిస్తమన్నరు. ఇంత వరకు ఆ ముచ్చటే లేదు.ఇల్లు కట్టిస్తామన్నరు అదీ లేదు, పరిహారం కూడాఅందలేదు. ఇప్పుడు ఎవరిని అడగాలో అర్థంఅయితలేదు.– గాండ్ల పెంటయ్య

ఊర్ల బొంద పెట్టనియ్యలే

నా భర్త చనిపోతే మా ఊర్లోని మా స్థలంలోబొంద పెట్టనియ్యలేదు. శవాన్ని కిరాయిఇళ్లల్ లో ఉండనియ్యలేదు. కానుకుం టలోరూ.10 వేలకు జాగా కొని అంత్యక్రియాలుచేసినం. దిక్కులేని పరిస్థితిలో పునరావాసకాలనీకి వచ్చి తలదాచుకున్నం .- తలారి మంగమ్మ

కట్టుబట్టలతో వెళ్లగొట్టిన్రు

ఎనిమిదేళ్ల కిం ద ఓ రోజు మబ్బులనేపోలీసులు, జేసీబీలతో వచ్చి కట్టు బట్టలతోబయటకు వెళ్లగొట్టి ఇండ్లు కూల్చేసిన్రు.నాలుగేళ్లకు ఈడ ప్లాట్లు ఇచ్చిన్రు.తాగుదామంటే నీళ్లు లేవు, రోగమొస్తేదవాఖానాలు లేవు. పిల్లల్ని చదివించేం దుకుదగ్గరలో బడిలేదు. బస్సులు కూడా రావు.అడవి ఉన్నట్లుం ది. పాములు, తేళ్లువస్తున్నా య్‍. ఇప్పటికైనా ఆఫీసర్లు సౌలత్‌ లుకల్పించాలే. – వరలక్ష్మి

టెండర్ల సమస్య వల్ల జాప్యం

టెండర్ల సమస్య వల్ల రిహాబిలిటేషన్‌ కాలనీలోమౌలిక సదుపాయల కల్పనలో జాప్యం జరుగుతోంది. జిల్లా పరిషత్‍లో దాచారం, దార్గుల గ్రామాల బాధితుల గురించి గతంలో పలుసార్లు ప్రస్తావించా. ఈ సమస్య తొందర్లోనే కొలిక్కి వస్తుంది. కాలనీలో ఇండ్లు కట్టించి అన్ని సౌలత్‌ లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.- కుంచాల ప్రభాకర్,జడ్పీ వైస్ చైర్మన్‍ దాచారం

Latest Updates