పాన్‌- ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపు

Govt extends cut off date for linking PAN with Aadhaar till September 30

సెప్టెంబర్‌‌ 30 వరకూ అవకాశం

న్యూఢిల్లీ: పాన్‌‌ కార్డును ఆధార్‌‌తో లింక్‌‌ చేసుకునేందుకు సర్కారు మరో ఆరు నెలలపాటు గడువిచ్చిం ది. అంటే సెప్టెంబర్‌‌ 30,2019 లోగా రెండు కార్డులను లిం క్ చేసుకోవాలన్నమాట. ఈ మేరకు ఆదివారం సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆధార్‌‌తో పాన్‌‌ లింకింగ్ కు సర్కారు గడువు పొడిగించడం ఇది ఆరోసారి. ఇంతకుముందు మార్చి 31,2019 లోగా ఆధార్‌‌తో పాన్‌‌ను లిం క్ చేసుకోవాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్‌‌ 1,2019 నుంచి ఇన్ కంట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి, తప్పనిసరిగా ఆధార్‌‌ నెంబర్‌‌ ఇవ్వాలని సీబీడీటీ స్పష్టం చేసింది.

Latest Updates