ఆధార్ – పాన్ లింక్ గ‌డువు పొడిగింపు

ఆధార్‌తో ప‌ర్మ‌నెంట్ అకౌంట్ నంబ‌ర్ (పాన్‌) అనుసంధానం గ‌డువును కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి పొడిగించింది. 2021 మార్చి 21లోపు ఆధార్ నంబ‌ర్‌తో పాన్ లింక్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తూ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని గ‌డువు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్ల‌డించింది.

వాస్త‌వానికి ఇప్ప‌టికే అనేక సార్లు ఆధార్ – పాన్ లింక్ గ‌డువును కేంద్రం పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31న ముగిసిన గ‌డువును క‌రోనా నేప‌థ్యంలో జూన్ 30 వ‌ర‌కు పొడిగించింది. అయితే క‌రోనా వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్ర రూపం దాల్చిన నేప‌థ్యంలో మ‌రోసారి డెడ్‌లైన్‌ను పెంచింది కేంద్రం. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని పాన్ – ఆధార్ లింక్ గ‌డువును వ‌చ్చే ఏడాది మార్చి 31 వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు ఐటీ శాఖ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

Latest Updates