దేశంలోని ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న‌ ప్రజలందరికీ కోవిడ్ టీకా అందించాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తామని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. అయితే కరోనా వ్యాప్తి అరికట్టేలా భారీ స్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తే సరిపోతుందని వెల్లడించారు.దేశంలో ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందికి కేవ‌లం 211 మందికి మాత్ర‌మే కరోనా సోకింద‌ని.. పెద్ద దేశాల‌తో పోలిస్తే ప్ర‌తి మిలియ‌న్ కేసుల సంఖ్య ఇండియాలోనే త‌క్కువ‌ని ఆయ‌న తెలిపారు.వైరస్​ వ్యాప్తిని నియంత్రించడమే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని , భారీ స్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్​ను ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు.

Latest Updates