పూర్తి స్థాయి డాక్టర్లుగా డెంటిస్టులు!

దేశంలో వైద్యుల కొరతను తగ్గించేందుకు డెంటిస్టులకు బ్రిడ్జ్‌ కోర్సు ప్రారంభించి, పూర్తిస్థాయి డాక్టర్లుగా ప్రాక్టీస్ చేసేందుకు అర్హత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ 9న పీఎం ఆఫీస్ లో జరిగిన సమావేశంలో బ్రిడ్జ్‌ కోర్సు ప్రారంభించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.ఈ మేరకు డెంటల్‌ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నీతి అయోగ్,వైద్యాధికారులు సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు . బీడీఎస్‌ చేసిన డెంటిస్టులు దంత వైద్యానికే పరిమితమవుతున్న నేపథ్యంలో ఫార్మకాలజీ,మైక్రోబయాలజీ, పెథాలజీ, అనాటమీ సహా పలు వైద్యాంశాలపై డెంటిస్టులకు శిక్షణ ఇవ్వాలని కేంద్రప్రతిపాదించింది. ఈ కోర్సు పూర్తి చేసినవారిని ఎంబీబీఎస్‌ డాక్టర్లలాగే ప్రాక్టీస్‌కు అర్హత కల్పించాలని..తద్వారా డాక్టర్ల కొరత కొంతైనా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.అట్లెట్లిస్తరు అంటూ మోడీకి లేఖకేంద్ర నిర్ణయంపై డాక్టర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డెంటిస్టులకు ఎంబీబీఎస్‌ హోదాఎట్ల ఇస్తారని కొందరు డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. బ్రిడ్జ్‌కోర్సు పెట్టి డెంటిస్టులను డాక్టర్లను చేసినట్టే, ఆర్నె ళ్లకోర్సు పెట్టి డాక్టర్లకు ఐఏఎస్ హోదా ఇవ్వాలం-టూ గుర్గావ్ కు చెందిన డాక్టర్‌ రితేశ్‌ శర్మ ప్రధానినరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. కేంద్రనిర్ణయాన్ని తెలంగాణ జూనియర్‌‌ వైద్యుల సంఘంఖండించింది. అసలే అర్హతలేని ఆర్‌‌ఎంపీ, పీఎంపీలవైద్యం కంటే, డెంటిస్టులకు చికిత్స చేసే అర్హత కల్పించడం మంచిదేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Latest Updates