వ్యాక్సిన్‌ డిస్ట్రిబ్యూషన్‌కి టాస్క్‌ఫోర్స్‌

  • ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి ఐడెంటిఫికేషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, కొనుగోలు, ఫైనాన్సింగ్‌ తదితర అంశాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఎక్స్‌పర్ట్‌ కమిటీని నియమించింది. హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన మినిస్ట్రీస్‌, ఇన్‌స్టిట్యూషన్స్‌లోని ఎక్స్‌పర్ట్స్‌తో టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్యానల్‌కి నీతి ఆయోగ్‌ మెంబర్‌‌ డాక్టర్‌‌ వి.కె. పౌల్‌ నేతృత్వం వహించనున్నారని, కో చైర్‌‌పర్సన్‌గా హెల్త్‌ సెక్రటరీ రాజేశ్‌ భూషన్‌ వ్యవహరించనున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. ప్రపంచంలో దాదాపు ఆరు వ్యాక్సిన్లు ఫేజ్‌ – 3 ట్రయల్స్‌ ఉన్నాయని, మిగతావి 2 – 3 ఫేజ్‌ ట్రయల్స్‌లో ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నారని అన్నారు. మన దేశంలో ఉపయోగించే వ్యాక్సిన్‌లు, వాటికి ఫైనాన్స్‌ తదితర అంశాలపై ఈ ప్యానల్‌ స్టడీ చేస్తుంది అని చెప్పారు. వ్యాక్సిన్‌ గుర్తించడంతో ప్యానెల్‌ వర్క్‌ ప్రారంభం అవుతుంది. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే రేసులో ముందు ఉన్న వ్యాక్సిన్‌ తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. వ్యాక్సిన్‌ని ఎలా ప్రొక్యూర్‌‌ చేయాలి, ఫారెన్‌ ఏజెన్సీస్‌ ద్వారా తీసుకోవాలా లేదా రాష్ట్ర ప్రభుత్వాలే సొంతంగా ప్రొక్యూర్‌‌ చేయాలా అనే అంశంపై రిసెర్చ్‌ చేసి ప్యానల్‌ నిర్ణయిస్తుందని అధికారులు అన్నారు. గవీ, ది వ్యాక్సిన్‌ అలయన్స్‌, వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌తో కో ఆర్డినేట్‌ అవుతుందని అన్నారు. ఫైనాన్సియల్‌ ప్లాన్‌, బడ్జెట్‌, తదితర అంశాలను ఫైనల్‌ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్‌పై దృష్టి సారిస్తారని చెప్పారు. మొత్తం 9 వ్యాక్సిన్లపై దృష్టి సారిస్తారని, వాటిలో రెండు చైనాకు చెందిన వ్యాక్సిన్లు కూడా ఉన్నాయని అధికారులు చెప్పారు. ముందుగానే ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయడం మంచిదని, ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్య అభినందనీయం అని కలకత్తా మెడికల్‌ కాలేజ్‌కి చెందిన డాక్టర్‌‌ సంజయ్‌ ఛటర్జీ అభిప్రాయపడ్డారు.

Latest Updates