‘ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పండి’

  • ఇండియా – చైనా బోర్డర్‌‌ ఇష్యూపై రాహుల్‌ ట్వీట్‌

న్యూఢిల్లీ: లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ (ఎల్‌ఏసీ) దగ్గర ఇండియా – చైనా మధ్య ఏం జరుగుతుందో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటే ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లు అవుతుందని శుక్రవారం ట్వీట్‌ చేశారు. “ చైనాతో సరిహద్దు విషయంపై ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉంటే అనవసరమైన ఊహాగానాలు అనిశ్చితికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో ఇలా చేయడం కరెక్ట్‌ కాదు. ఏం జరుగుతుందో జనానికి చెప్పాలి” అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. లడఖ్‌లోని ప్యాంగాంగ్‌ లేక్‌ ఏరియాలో వాస్తవాధీన రేఖ దగ్గర చైనా బలగాలు భారత్ భూభాగంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఉద్రికత్త నెలకొంది. కాగా.. చైనాతో తలెత్తిన ఈ సమస్యను సామరస్యపూర్వకంగా చర్చలతోనే పరిష్కరించుకుంటామని మన దేశం ఇప్పటికే ప్రకటించింది. చైనా కూడా బోర్డర్‌‌లో అంతా శాంతియుతంగా ఉందంటూ ప్రకటన చేసింది.

ఇవి కూడా చదవండి

చైనా ఇష్యూపై మోడీకి ఫోన్ చేశా.. ఆయ‌న మూడ్ బాగోలేదు: ట‌్రంప్

మోడీ, ట్రంప్‌ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు

Latest Updates