కార్సొరేట్ ట్యాక్స్ భారీ తగ్గింపు

పనాజీ: దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా శుక్రవారం కీలక నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డీలాపడిన తయారీ, సేల్స్ రంగాలు జోరందుకునేందుకు కార్పొరేట్‌ పన్నుల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశీయ కంపెనీల కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. కొత్త కంపెనీలకు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 25 నుంచి 15 శాతానికి తగ్గించామన్నారు. అక్టోబరు 1 తర్వాత తయారీ రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టి యూనిట్లను ప్రారంభించే దేశీయ కంపెనీలు 15 శాతం ఇన్ కం ట్యాక్స్ చెల్లిస్తేచాలని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ మేరకు పన్ను చెల్లింపు నిబంధనల్లో మార్పులు తెస్తామన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.

Latest Updates