ఒంటరితనం భరించలేక ఉరేసుకున్న టీచర్​

ఇల్లందకుంట: భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్న ఓ ప్రభుత్వ టీచర్​ ఒంటరితనాన్ని భరించలేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ ​జిల్లా ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి(58) పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​మండలం ఉషన్నపల్లి గ్రామంలోని గవర్నమెంట్​స్కూల్లో ఎస్​జీటీ టీచర్‌‌‌‌గా చేస్తున్నాడు. సమ్మిరెడ్డి కొన్నేళ్లుగా భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల స్కూళ్లకు హాలిడేస్ ​రావడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఒంటరితనాన్ని భరించలేక మూడ్రోజుల క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి చెడు వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు నిర్ధారించారు. మృతుడి సోదరి రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ యాదగిరి తెలిపారు.

ఎకానమీపై లాక్ డౌన్ ప్రభావం చాలా ఎక్కువ

Latest Updates