మిషెల్ ఒబామాకు గ్రామీ అవార్డ్

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా గ్రామీ అవార్డును గెలుపొందారు. ‘బికమింగ్’ పేరుతో ఆమె విడుదల చేసిన ఆల్బమ్ కు బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ కేటగిరీలో అవార్డు దక్కింది. మిషెల్ కు గ్రామీ అవార్డు రావడం ఇదే మొదటిసారి. ఆమె 2013లో ‘అమెరికన్ గ్రోన్: ద స్టోరీ ఆఫ్​ద వైట్ హౌజ్ కిచెన్ గార్డెన్ అండ్ గార్డెన్స్ అక్రాస్ అమెరికా’ ఆల్బమ్ కు నామినేట్ అయినా, అవార్డు దక్కలేదు. 62వ గ్రామీ అవార్డుల వేడుక ఆదివారం లాస్ ఏంజెలిస్ లో అట్టహాసంగా జరిగింది. మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యున్నత అవార్డులుగా భావించే గ్రామీ అవార్డుల్లో ఈ ఏడాది అమెరికన్ సింగర్ బిల్లీ ఎలిష్​ టాప్ లో నిలిచారు.

ఇందులో ఎలిష్​ ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకున్నారు. రికార్డ్ ఆఫ్​ద ఇయర్ (బ్యాడ్ గై), ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ (వెన్ వియ్ ఆల్ ఫాల్ అస్లీప్, వేర్ డూ వియ్ గో?), బెస్ట్ న్యూ ఆర్టిస్ట్, బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్, బెస్ట్ ఇంజినీర్డ్ ఆల్బమ్, నాన్ క్లాసికల్ విభాగాల్లో ఆమె అవార్డులను గెలుపొందారు. ఇక అమెరికన్ స్టాండప్ కమెడియన్ దేవ్ చాపెల్ తన ‘స్టిక్స్ అండ్ స్టోన్స్’ ఆల్బమ్ కు గాను ‘బెస్ట్ కామెడీ ఆల్బమ్’ అవార్డును అందుకున్నారు. బెస్ట్ ర్యాప్/సంగ్ పర్ఫామెన్స్ విభాగంలో హయర్ సాంగ్ (డీజే ఖాలెద్, ఆల్బమ్: నిప్సే హజిల్ జాన్ లెజెండ్)కు అవార్డు దక్కింది. బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ కేటగిరీలో ఐగర్ ఆల్బమ్ (టైలర్, ద క్రియేటర్)కు అవార్డు లభించింది. మొత్తంగా దాదాపు 50 కేటగిరీల్లో ఆయా విజేతలకు అవార్డులను ప్రకటించారు.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి

Latest Updates