సరిలేరు నీకెవ్వరు ఫ్రీ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రిన్స్ మహేష్ బాబు ప్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ ఈ సంక్రాంతికి రానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో మరింత జోష్ ను పెంచింది యూనిట్. సంక్రాంతి కానుక‌గా జ‌నవ‌రి 11న విడుద‌ల కానుందని పోస్ట‌ర్‌ లో తెలిపారు మేకర్స్. ఆ రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌న‌క వ‌ర్షం కుర‌వ‌డం ఖాయమ‌ని అభిమానులు చెబుతున్నారు. ఈ మూకి సంబంధించి ప్ర‌తి సోమవారం సాంగ్ విడుద‌ల చేస్తుండ‌గా, ఈ సోమవారం హీ ఈజ్ సో క్యూట్ అనే సాంగ్ విడుద‌ల కానుంది. ఈ సాంగ్‌కి సంబంధించి రష్మిక టిక్ టాక్ వీడియో చేసిన సంగ‌తి తెలిసిందే.

అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో విజ‌య‌శాంతి ముఖ్య పాత్ర‌లో క‌నిపించనుంది. ఇటీవ‌ల ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ కాగా,  ప్రేక్ష‌కుల‌లో మూవీపై అంచ‌నాలు పెంచింది. దేవి శ్రీ మ్యూజిక్ బాగుందంటున్నారు.  ఈ చిత్రంలో మ‌హేష్ బాబు మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించనున్నాడు. పోస్టర్ లోనూ అదె లుక్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేసిన యూనిట్.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా అనౌన్స్ చేసి మరింత థ్రిల్ ఇచ్చింది. సరిలేరు నీకెవ్వరు మూవీ ఫ్రీ రిలీజ్ వేడకను జనవరి-5న నిర్వహించనున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

Latest Updates