అభిషేక్ వర్మ, దీపక్ కు ఘన స్వాగతం

ఢిల్లీ : బ్రెజిల్ లో జరిగిన షూటింగ్ వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత ఆటగాళ్లకు  ఘన స్వాగతం లభించింది. అభిషేక్ వర్మ, దీపక్ కుమార్ ను ఢిల్లీ ఎయిర్ పోర్టులో  రిసీవ్ చేసుకున్నారు క్రీడాశాఖ అధికారులు, అభిమానులు. 10 మీటర్ల  ఎయిర్ ఫిస్టల్  ఈవెంట్ విభాగంలో అభిషేక్ వర్మ  గోల్డ్ సాధించగా.. 10 మీటర్ల  ఎయిర్ రైఫిల్  మిక్స్ డ్  విభాగంలో  దీపక్ కుమార్ బంగారు పతకం సాధించారు. ఈ టోర్నీలో  భారత్ ఐదు  స్వర్ణ పతకాలతో  మొత్తం 9 మెడల్స్ సాధించింది.

Latest Updates